News June 24, 2024

నిర్మల్ జిల్లా వాసికి అకాడమి పురస్కారం

image

నిర్మల్ ఉపాధ్యాయునికి జిద్దా ఉర్దూ అకాడమీ పురస్కారం లభించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర) ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మహమ్మద్ ఇంతియాజ్‌కు ప్రతి ఏడాది సౌదీ అరేబియాలోని జిద్దా ఉర్దూ అకాడమీ వారు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. దీంతో జిద్దా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఆయనను హైదరాబాద్‌లో సన్మానించారు.

Similar News

News February 10, 2026

ఆదిలాబాద్: రేపే పోలింగ్.. 216 కేంద్రాలు ఏర్పాటు

image

ADB మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బుధవారం జరగనుంది. మొత్తం 49 వార్డులు ఉండగా 69,813 మంది పురుష ఓటర్లు, 73,836 మంది మహిళ ఓటర్లు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. పట్టణ పరిధిలో మొత్తం 1,43,655 ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 216 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,154 మంది సిబ్బందిని నియమించారు. 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగుల కోసం 145 వీల్ ఛైర్స్, 125 ఆటోలను ఏర్పాటు చేశారు.

News February 9, 2026

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి: ADB కలెక్టర్

image

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోని జిల్లాలో వంద పోలింగ్ శాతం నమోదుకు భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మాజీ సైనికుల సంఘాల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

News February 9, 2026

గ్రీవెన్స్ డే ఫిర్యాదులపై స్పందించాలి: ADB SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో SP అఖిల్ మహాజన్ బాధితుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, భూ తగాదాలు, పెండింగ్ కేసులపై స్పందించిన ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని సూచించారు.