News May 2, 2024

నిర్మల్: జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రాగల మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం గరిష్ఠంగా జిల్లా వ్యాప్తంగా 45.5 డిగ్రీలు, గురువారం 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. శుక్రవారం 42.7, శనివారం 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు వెల్లడించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News April 7, 2026

ADB: వసతి గృహాల్లో 100% ప్రవేశాలు కల్పించాలి

image

ఆదిలాబాద్ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 100% ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలో పర్యటించి పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. వసతి గృహాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు.

ఆదిలాబాద్ : పది పరీక్షకు 22 మంది గైర్హాజరు

image

అదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం బయాలజీ సైన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలను పకడ్బందీ నిర్వహిస్తున్నారు. సైన్స్ పరీక్షకు 1097 మంది విద్యార్థులకు గాను 1885 మంది విద్యార్థులు హాజరై 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు.