News March 1, 2026

నిర్మల్ జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో విజేతలు వీరే

image

పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడల్లో పలు పాఠశాలల జట్లు విజేతలుగా నిలిచినట్లు నిర్మల్ DEO భోజన్న తెలిపారు. కబడ్డీ బాలుర విభాగంలో నిర్మల్‌ ఆశ్రమ పాఠశాల ప్రథమ, లక్ష్మణచందా ZPHS ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలో భైంసా ఆశ్రమ పాఠశాల విజేతగా, దిలావర్‌పూర్‌ ZPHS రన్నరప్‌గా నిలిచాయి. అలాగే ఖోఖో బాలుర విభాగంలో నిర్మల్‌ ఆశ్రమ పాఠశాల ప్రథమ, లక్ష్మణచందా ZPHS ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.

Similar News

News March 1, 2026

సమయం మారి… సమాచారం లీకై..!

image

ఇరాన్ సుప్రీం ఖమేనీపై US నెలల తరబడి నిఘా పెట్టి దాడిచేసింది. US నిఘా సంస్థ CIA ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా దృష్టి పెట్టింది. పాలనా భవనాల్లో శుక్రవారం సాయంత్రం ఖమేనీ, ఇతరులు భేటీ కాబోతున్నట్లు గుర్తించినా ఏ భవనంలో అన్నది స్పష్టం కాలేదు. అయితే సమావేశాన్ని నిన్న ఉదయానికి మార్చడంతో అది లీకైంది. ఏ టైమ్, ఎక్కడ అన్న కచ్చితమైన సమాచారంతో దాడిచేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

News March 1, 2026

రెండో రోజు సెలబ్రిటీ క్రికెట్ పోటీలు ప్రారంభించిన గంటా

image

మధురవాడ ఏసీఏ – వీడీసీఏ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండో రోజు పోటీలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. బలమైన జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ అందరికీ ఆనందాన్ని పంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజుతో ముగుస్తున్న సెలబ్రిటీ క్రికెట్ విశాఖ ప్రజలకు మంచి అనుభూతిని అందించిందన్నారు. టాస్ వేసి పోటీలను ఆరంభించారు.

News March 1, 2026

ఇరాన్‌కు UAE ప్రెసిడెంట్ వార్నింగ్

image

‘మీ యుద్ధం పొరుగుదేశాలతో కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి’ అంటూ ఇరాన్‌ను UAE ప్రెసిడెంట్ మహ్మద్ బిన్ జాయెద్ హెచ్చరించారు. పొరుగు దేశాలతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. UAEలోని పలు ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ దాడులు గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ను దూరం చేశాయన్నారు. US, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైనా ఇరాన్ దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే.