News January 27, 2025
నిర్మల్: టీజీపీఎస్సీ పరీక్షా నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు

నిర్మల్ జిల్లాలో టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కోఆర్డినేటర్స్ డా.పీజీ రెడ్డి, డా. యూ.రవి కుమార్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. వారికి గణతంత్ర వేడుకల సందర్భంగా ఉత్తమ ప్రశంసాపత్రాల్ని అందజేశారు. కాగా వీరు జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(భైంసా) హిస్టరీ, ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా పనిచేస్తున్నారు. కళాశాల అధ్యాపకుల బృందం వీరిని అభినందించారు.
Similar News
News September 19, 2025
కేసీఆర్‌కు ఉసురు తాకి కూతురు దూరమైంది: రేవంత్ రెడ్డి

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.
News September 19, 2025
వారాహి పీఠం కాదు.. వారాహి దేవస్థానం

కాకినాడ రూరల్ కొవ్వూరులో వివాదస్పదమైన వారాహి పీఠంను ఇటీవల దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వారాహి పీఠం బోర్డు తొలగించి వారాహి దేవస్థానంగా అధికారులు నామకరణం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలను దేవస్థానాలుగా పిలుస్తారని.. అందుకే పీఠం పేరు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
News September 19, 2025
కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లేనా: రేవంత్

ఒక ప్రజా ప్రతినిధి మరొక పార్టీ జెండా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాసేపటి క్రితం నేను కూడా కొందరికి కండువాలు కప్పాను. ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారు’ అని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో ఉదహరించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు లేవని తెలిపారు. BRS ఫిర్యాదుపై స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు.