News April 22, 2025
నిర్మల్: టెలిఫోన్‌లో ప్రజావాణి.. వాట్సప్‌లో రసీదులు

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారుల తరలివచ్చారు. స్థానిక సంస్థల ప్రాథమిక కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఫిర్యాదులను స్వీకరించారు. ముఖ్యంగా పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. దాంతోపాటు అధిక ఉష్ణోగ్రతల వల్ల రాలేని వారి కోసం టెలిఫోన్‌లోను ఫిర్యాదుల స్వీకరణ చేసి రసీదులను 9100577132 వాట్సప్‌లో పంపించామన్నారు.
Similar News
News April 22, 2025
కామారెడ్డి: 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

ఈ నెల 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అచ్చంపేట్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కార్తీక సంధ్య తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ 6వ తరగతి పరీక్ష ఉదయం 10 నుంచి 12 వరకు, 7, 8, 9, 10 తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్లను telanagana.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 22, 2025
గద్వాల: క్విజ్ పోటీల్లో ఉత్తనూర్ విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్

గద్వాల బాల భవన్‌లో సోమవారం రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి క్విజ్ పోటీలు జరిగాయి. సైన్స్ విభాగంలో జరిగిన పోటీల్లో అయిజ మండలం ఉత్తనూర్ జడ్పీహెచ్ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అమరేశ్ మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు. డీఈవో అబ్దుల్ గని, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎస్తేరు రాణి, సైన్స్ ఆఫీసర్ పాపన్న చేతుల మీదుగా బహుమతి అందజేశారు. ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
News April 22, 2025
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: SP

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 9 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ స్వీకరించి బాధితుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.