News January 24, 2026

నిర్మల్: డీలర్ వద్దే వాహన రిజిస్ట్రేషన్

image

వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పు తెచ్చింది. శనివారం (జనవరి 24) నుంచి కొనుగోలు చేసే వాహనాలకు డీలర్ పాయింట్ వద్దే రిజిస్ట్రేషన్ జరుగుతుందని రవాణా శాఖ అధికారులు దుర్గాప్రసాద్, మహేందర్ తెలిపారు. వాహనదారులు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, షోరూమ్‌లోనే ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందన్నారు.

Similar News

News April 17, 2026

ఎల్కతుర్తి ఎస్‌ఐ ఏఆర్‌కు అటాచ్

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా ఆయన్ను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యతో పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇద్దరి ఎస్సైలపై వేటు వేసిన విషయం తెలిసిందే.

News April 17, 2026

ఇందూరు కోట.. ఖిల్లా రఘునాథ ఆలయం

image

నిజామాబాద్ నగర నడిబొడ్డున ఎత్తైన గుట్టపై ఉన్న ఈ కోటను రాష్ట్రకూటులు నిర్మించగా, అనంతరం ఛత్రపతి శివాజీ దీనిని అభివృద్ధి చేశారు. ఇక్కడి రామమందిరం ఆధ్యాత్మికతకు నిలయం. కోటలోని రాతి కట్టడాలు, బురుజులు నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి సాక్ష్యాలు. పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం నుండి నగరం మొత్తాన్ని చూడవచ్చు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం

News April 17, 2026

వనరాజా కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

పెరటి కోళ్ల పెంపకానికి ‘వనరాజా’ మరో అనువైన రకం. ఇవి అధిక సంఖ్యలో గుడ్లు, అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10-12 వారాల వయసులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5 నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్నిస్తాయి. పెట్టకోడి ఏటా 150 గుడ్లను పెడుతుంది. ఇది కుక్కలు, పిల్లుల బారి నుంచి త్వరగా తప్పించుకుంటుంది.