News December 10, 2024
నిర్మల్: తండ్రిని కొట్టి, ఉరేసి చంపిన కొడుకు

తండ్రిని కొడుకు చంపిన ఘటన నిర్మల్‌లో జరిగింది. SI లింబాద్రి వివరాల ప్రకారం.. ముఠాపూర్‌కు చెందిన ముత్యం(47) ఆదివారం రాత్రి తన తల్లిని మద్యం కోసం డబ్బులివ్వాలని కొట్టాడు. అప్పుడే ఇంటికి వచ్చిన ముత్యం కొడుకు మణిదీప్ నానమ్మను కొట్టాడనే కోపంతో తండ్రిని చితకబాదాడు. కోపం తగ్గకపోవడంతో చీరతో ఉరేసి చంపాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వృద్ధురాలిని ఆరాతీయడంతో విషయం బయటపడినట్లు SI వెల్లడించారు.
Similar News
News February 4, 2026
ఆదిలాబాద్: 9 సార్లు ఎన్నికలు.. ఒకరే మహిళ ఛైర్‌పర్సన్

ADB మున్సిపాలిటీ చరిత్రలో ఏకైక ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన రంగినేని మనీషా మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1952లో ఏర్పాటైన పురపాలక సంఘానికి 2014లో ఆమె సారథ్యం వహించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కక దూరమైనా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ‘ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్’ తరఫున బరిలోకి దిగుతున్నారు. 48వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న ఆమె, తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.
News February 4, 2026
ఆదిలాబాద్ జిల్లాలో ఐదు చెక్ పోస్టులు: ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. అక్రమ మద్యం, నగదు, బహుమతులు తరలకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐదు ఎస్‌ఎస్‌టి చెక్ పోస్టులలో 24 గంటలు వాహనాల తనిఖీ జరుగుతుందని, రూ.50 వేలకుపైగా నగదు ఉంటే సరైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు స్వామి, ఫనిధర్ ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.