News October 16, 2025
నిర్మల్: తూపాకి పట్టి సరిగ్గా 40 ఏళ్లు..!

సరిగ్గా 40 ఏళ్ల కిందట జనం వీడి వనంలోకి వెళ్లిన మోహన్ రెడ్డి MH CM ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోయారు. నిర్మల్ జి. సోన్ మం. కూచన్ పెల్లికి చెందిన మోహన్ రెడ్డి 1960లో జన్మించాడు. 1976లో టెన్త్ పూర్తి చేసి ITI కోసం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ పీపుల్స్ వార్ భావజాలానికి ఆకర్షితుడై 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2007లో జార్ఖండ్‌లో ఆయుధాల డెన్‌తో పోలీసులకు దొరికి జైలుకు వెళ్లి 2011లో విడుదలయ్యారు.
Similar News
News October 16, 2025
నెల్లూరు: బస్టాండ్ ఓ చోట.. బస్సులు ఆపేది మరోచోట

నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు RTC బస్టాండ్ ఎదురుగా ఆటోలు, ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా ఆపేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు సర్వోదయ కాలేజీని అనుకుని యూనియన్ బ్యాంక్ వద్ద బస్టాండ్‌ని ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం వాహనాలు నిలపకుండా..కాలేజ్ ఎదురుగా ఆపేస్తున్నారు. ఫలితంగా బస్టాండ్ కట్టినా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
News October 16, 2025
జూబ్లీహిల్స్‌లో బై‘పోల్’ పరేషాన్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది ఈసారేకాదు నియోజకవర్గం కొత్తగా ఏర్పడినప్పటి నుంచీ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో 56 శాతం, 2018లో 47.58 శాతం, 2023లో 45.59 శాతం పోలింగ్ జరిగింది. అంటే పదేళ్లలో దాదాపు 10 శాతం పడిపోయింది. మరి ఈసారి ఎంత శాతం నమోదవుతుందో చూడాలి.
News October 16, 2025
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికిన మహబూబ్‌నగర్ కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పూల మొక్కతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక పోలీసుల నుంచి రాష్ట్ర గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.