News December 6, 2025

నిర్మల్: తొలి విడతలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్స్ జరగనున్న ఆరు మండలాల్లో మొత్తం 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మామడ 5, ఖానాపూర్ 5, పెంబి 4, దస్తురాబాద్, లక్ష్మణచందా మండలాల్లో 1 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కడెంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు.

Similar News

News December 6, 2025

నిర్మల్: పంచాయతీ ఎన్నికల్లో తాయిలాలు షురూ.!

image

నిర్మల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన రీతిలో తాయిలాలతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. క్వార్టర్ సీసాలు, డబ్బులు, విలువైన వస్తువులను ఇచ్చి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓటును అమ్ముకోవద్దని పోలీసులు, మేధావులు సూచిస్తున్నప్పటికీ, కొంతమంది ఓటర్లు వాటిని పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

News December 6, 2025

జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లు

image

అలంపూర్‌లో వెలసిన జోగులాంబ దేవి ఆలయ అభివృద్ధి కోసం రూ.347 కోట్లతో ప్రణాళికను రూపొందించారు. శుక్రవారం సచివాలయంలో ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ ప్రణాళికను వివరిస్తామని తెలిపారు. జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం సీఎంకు ఉందని వారు పేర్కొన్నారు.

News December 6, 2025

రెండో విడత ఎన్నికలు.. నేడు గుర్తులు కేటాయింపు.!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు ఈరోజు గుర్తులు కేటాయించనున్నారు. అటు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇప్పటికే రెబల్స్ బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేయించే పనిలో నిమగమయ్యారు. కాగా గుర్తుల కేటాయింపు అనంతరం ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది.