News August 14, 2025
నిర్మల్: నష్టం జరగకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో స్థితిని ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నీటి మట్టం పెరిగిన సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
Similar News
News August 14, 2025
ఆమనగల్‌లో రూ.4 కోట్ల BC హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన

NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ కలిసి ఆమనగల్ మండల కేంద్రంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించబోయే BC హాస్టల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ నిధులు అరబిందో పార్మా కంపెనీ నుంచి CSR ఫండ్ ద్వారా ఎంపీ మల్లు రవి ప్రత్యేక చొరవతో మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News August 14, 2025
విశాఖ: రెండు రోజుల పాటు మాంసం విక్రయాలు బంద్

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.
News August 14, 2025
వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూటమిదే విజయం: మంత్రి

AP: వచ్చే ఎన్నికల్లో(అసెంబ్లీ, పార్లమెంటు) పులివెందులలో కూటమిదే విజయమని మంత్రి పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు. ‘పులివెందుల ZPTC ఎన్నికల్లో TDP విజయం 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి తొలి మెట్టు. YCPకి ఇది బలమైన నియోజకవర్గం. ఓటింగ్‌ను బహిష్కరించాలని ఆ పార్టీ చెప్పినా 55-65% పోలింగ్ నమోదైంది. ప్రజల్లో YCPపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనం. పోలీసులను జగన్ కించపరచడం సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు.