News December 29, 2025
నిర్మల్: నీటిలోకి తోసేసి చంపేశారు

నిర్మల్ జిల్లాలో గల్లంతైన సారంగాపూర్ మం. లింగాపూర్ వాసి కార్తీక్ మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఈనెల 25న మేనబావ గంగాప్రసాద్ మరో మైనర్‌తో బయటివెళ్లిన కార్తీక్ శవమయ్యాడు. తనకు ఈత రాదని చెప్పినా వినిపించుకోకుండా మద్యం మత్తులో ఉన్న మేనబావ, బాలుడు నీటిలోకి తోసేయడంతో మృతిచెందాడు. గజఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశామని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
Similar News
News December 30, 2025
2025: నోరు జారి ట్రోల్ అయ్యారు

ఈ ఏడాదిలో పలువురు సెలబ్రిటీలు తమ వ్యాఖ్యలతో ట్రోల్ అయ్యారు. ‘అరి’ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యర్ రిలీజ్ సమయంలో చేసిన <<17980424>>వ్యాఖ్యలు<<>> మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపాయి. హనుమాన్‌పై కోపం అంటూ దర్శకుడు రాజమౌళి సైతం ట్రోల్ అయ్యారు. రాజాసాబ్ డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించగా ఆయన <<18374715>>క్షమాపణలు<<>> చెప్పారు. ఇటు శివాజీ <<18688029>>వ్యాఖ్యలు<<>> సృష్టించిన దుమారం ఇంకా చల్లారలేదు.
News December 30, 2025
కోడూరు వద్ద ప్రమాదం.. మహిళ స్పాట్‌డెడ్

రైల్వే కోడూరు మండలంలోని సెట్టిగుంట పంచాయతీ ప్రధాన రహదారిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భార్యాభర్తలు బైకుపై తిరుపతి వైపు వెళ్తుండగా బైక్ గుంతలో పడి అదుపుతప్పి లారీని ఢీకొనడంతో మహిళ కిందపడి మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 30, 2025
ఏలూరు: ‘జిల్లా పోయే.. IIPM వచ్చే’

చారిత్రాత్మక పట్టణం నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలన్న స్థానికుల కల ఈసారి కూడా నెరవేరలేదు. జిల్లా మార్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు తాజా పరిణామాలు నిరాశను మిగిల్చాయి. అయితే, రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం పట్టణానికి కొంత ఊరటనిచ్చింది. నూజివీడులో IIPM ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈక్రమంలో పట్టణంలో ‘జిల్లా పోయే.. ఐఐపీఎం వచ్చే’ అనే చర్చ సర్వత్రా సాగుతోంది.


