News October 16, 2025

నిర్మల్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక బస్సు

image

నిర్మల్ డిపో ఆర్టీసీ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించారు. ఈనెల 27న మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ నుంచి ప్రయాగ్‌రాజ్ దేవాలయానికి ప్రత్యేక బస్సు నడపనున్నారు. ఈ యాత్రలో కాశీ, అయోధ్య దేవస్థానాల దర్శనం కూడా ఉంటుంది. ఒక్కరికి చార్జి రూ.6,399గా నిర్ణయించారు. టికెట్లను ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలన్నారు. వివరాలకు 9959226003, 8328021517 నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News October 16, 2025

మధ్యాహ్నం కేబినెట్ భేటీ.. సురేఖ వస్తారా..?

image

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా దంపతుల వ్యవహారం మరింత ముదిరింది. పొంగులేటిపై టెండర్ల విషయంలో కామెంట్లు సహా, రెడ్లంతా తమ ఫ్యామిలీపై కుట్ర చేస్తున్నారని ఆమె కూతురు ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉండగా ఆమె వస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సురేఖ రాజీనామా చేస్తారని కొందరు, ఆమెను తప్పిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

News October 16, 2025

కొండా దంపతుల భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

image

మంత్రి పొంగులేటితో మొదలైన లొల్లి సుమంత్ విషయం వరకు వెళ్లి సీఎంను కూడా తాకింది. తమపై రెడ్లు కుట్ర చేస్తున్నారంటూ సుష్మిత ఆరోపించగా.. సుమంత్ విషయం తనకేమీ తెలియదని మురళి తెలిపారు. హన్మకొండలోని సురేఖ ఇంటివద్ద పోలీస్ అవుట్ పోస్టునూ తొలగించారు. మరోవైపు ఇవాళ కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ ఉండగా.. మురళి మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

News October 16, 2025

విశాఖ: ‘పవన్‌ కళ్యాణ్‌ను కలిసేదాకా ఊరెళ్లను’

image

బెట్టింగ్‌ యాప్‌ల వల్ల తనలా ఎవరూ నష్టపోకూడదని సాయి కుమార్ అనే యువకుడు పాదయాత్ర చేస్తూ విశాఖ నుంచి మంగళగిరి జనసేన ఆఫీసుకు వెళ్లాడు. బెట్టింగ్ యాప్‌ల వలలో పడి రూ.20 లక్షలు నష్టపోయానని తెలిపాడు. మరొకరు ఇలా నష్టపోకూడదని అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ యాప్‌లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసు ముందు నిరసనకు దిగారు. పవన్‌ను నేరుగా కలిసి విన్నవించాకనే వెళ్తానంటున్నాడు.