News July 1, 2024

నిర్మల్: నూతన చట్టంలో మొదటి కేసు నమోదు: ఎస్పీ

image

దేశవ్యాప్తంగా నూతన చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందా మండల పోలీస్ స్టేషన్‌లో సోమవారం మొదటి కేసు నమోదయిందని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన పోశెట్టి అనే వ్యక్తి ఈరోజు ఉదయం చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 9, 2026

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి: ADB కలెక్టర్

image

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోని జిల్లాలో వంద పోలింగ్ శాతం నమోదుకు భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మాజీ సైనికుల సంఘాల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

News February 9, 2026

గ్రీవెన్స్ డే ఫిర్యాదులపై స్పందించాలి: ADB SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో SP అఖిల్ మహాజన్ బాధితుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, భూ తగాదాలు, పెండింగ్ కేసులపై స్పందించిన ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని సూచించారు.

News February 9, 2026

ADB: ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మైకులు మూగబోవడంతో ఒకసారిగా పట్టణంలో వాతావరణం ప్రశాంతంగా మారింది. చివరి రోజున రాజకీయ నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. గత రెండు వారాలుగా ఎన్నికల ప్రచారంతో గల్లీలో సందడి వాతావరణం కనిపించింది. ఏ వీధి చూసిన ప్రచార హోరు కనిపించింది. మరోవైపు సాయంత్రం 5గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.