News January 3, 2026

నిర్మల్: నేటి నుంచి సదరం వైద్య శిబిరాలు

image

నేటి నుంచి దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయుటకు వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ విజయలక్ష్మి ప్రకటనలో తెలిపారు. మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఫోన్‌కు సమాచారం వచ్చిన దివ్యాంగులు ఆయా తేదీల్లో నిర్వహించే సదరం శిబిరాలకు హాజరై వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 30వ తేదీ వరకు సదరం శిబిరాలు ఉంటాయని తెలిపారు.

Similar News

News February 19, 2026

అమరావతిలో మిగిలిన భూముల సేకరణ

image

అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములను భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా 2,459 ఎకరాల భూమి పూలింగ్‌కు రాలేదు. అయతే భూసేకరణ నోటిఫికేషన్ విడుదలకు ముందే రైతులు ముందుకొస్తే, వారికి ల్యాండ్ పూలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 19, 2026

పట్టిసీమ భద్రకాళి వీరేశ్వర స్వామిని దర్శించిన శేఖర్ మాస్టర్

image

పోలవరం పట్టిసీమ శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామిని సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి అర్చనలు చేసి ఆశీర్వాదాలు పొందారు. శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనతో సెల్ఫీలు దిగారు.

News February 19, 2026

కర్నూలు: ప్రేమ విషయమై గొడవ.. బలవన్మరణం

image

ఆదోని అరుణ్ జ్యోతి నగర్ కాలనీకి చెందిన మహేశ్(20) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ‘మహేశ్ బేల్దారి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనై మేడపై ఇంట్లో ఉరేసుకొన్నాడు. ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు’ అని మూడో పట్టణ ఎస్ఐ రామస్వామి తెలిపారు.