News March 5, 2025

నిర్మల్: పకడ్బందీగా SSC పరీక్షలు :DEO

image

పకడ్బందీగా SSC పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో రామారావు తెలిపారు. సోన్ మండలం కడ్తాల్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న ఆంగ్ల పీరియడ్‌ను పరిశీలించారు. అక్కడ ప్రదర్శించబడిన గ్రాండ్ టెస్ట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పిలిచి, అన్ని విషయాల్లో వారి ప్రగతిని పరిశీలించారు.

Similar News

News July 6, 2025

ఇండియన్ మూవీస్.. 6 నెలల్లో రూ.5,360cr+ కలెక్షన్స్!

image

ఈ ఏడాది తొలి 6 నెలల్లో 856 భారతీయ సినిమాలు థియేటర్లలో రిలీజై ₹5,360కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. గత ఏడాది మొదటి 6 నెలలతో (₹5,260cr) పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ₹300crకు పైగా వసూళ్లతో టాప్‌లో ఉండగా ఓవరాల్‌గా ‘ఛావా’ ₹800crతో తొలి స్థానంలో ఉంది. ‘గేమ్ ఛేంజర్’ వంటి పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దక్షిణాది సినిమాల హవా కాస్త తగ్గింది.

News July 6, 2025

మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లు.!

image

దక్షిణ మధ్య రైల్వే మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ మీదుగా ఈనెల 9 నుంచి సెప్టెంబర్ 25 మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 07717 (తిరుపతి- హుసూర్), 07718 (హుసూర్- తిరుపతి), 07653 (కాచిగూడ- తిరుపతి), 07654 (తిరుపతి- కాచిగూడ), 07219 (నరసాపూర్- తిరువన్నామలై), 07220 (తిరువన్నామలై- నరసాపూర్) ప్రత్యేక రైలు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

News July 6, 2025

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: విద్యార్థులు 3 రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది. టీచర్లు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.