News February 11, 2025

నిర్మల్‌: పన్నుల వసూలు త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో పన్ను వసూలును త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లో ఆస్తి, వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలును 100శాతం పూర్తి చేయాలన్నారు. పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు పూర్తి చేసిన వివరాలపై ఆరా తీశారు.

Similar News

News April 2, 2026

ఇసుక రవాణాలో పారదర్శకత పాటించాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ఇసుక రవాణా పారదర్శకంగా సాగాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మన ఇసుక – వాహనం’ పోర్టల్ పనితీరు, ఇసుక నిల్వలను సమీక్షించారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మైనింగ్ ఏడీ రవీందర్ పాల్గొన్నారు.

News April 2, 2026

హాస్టల్‌కు వెళ్లిన కలెక్టర్ కీర్తి చేకూరి.. కారణం ఇదే!

image

అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో గురువారం రాత్రి కలెక్టర్ కీర్తి చేకూరి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆమె స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ఆమె సూచించారు. కలెక్టర్ రాకతో వసతి గృహంలో సందడి నెలకొంది.

News April 2, 2026

భూపాలపల్లి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు: డీఈఓ

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, సందర్శించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. కాటారం, మహాముత్తారం ZPHS పాఠశాలలను తాను సందర్శించినట్లు డీఈవో తెలిపారు.