News April 25, 2024
నిర్మల్: పరారీలో ఉన్న హోంగార్డ్ అరెస్ట్
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడి పరారీలో ఉన్న హోమ్ గార్డ్ షమీముల్లా ఖాన్ (షకీల్)ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
నిర్మల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ పలువురిని మోసగించినట్లు సీఐ అనిల్ తెలిపారు. పరారీలో ఉన్న అతణ్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల, డీఎస్పీ గంగారెడ్డి పోలీసులను అభినందించారు.
Similar News
News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు
కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
News February 5, 2025
బెల్లంపల్లి: మావోయిస్టుల లేఖ కలకలం
బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని పాత గనిని ఓపెన్‌కాస్ట్ చేసే ప్రయత్నాలను సింగరేణి విరమించుకోవాలని మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ప్రకటనలో డిమాండ్ చేశారు. OCగా మారిస్తే పరిసర గ్రామాలతో పాటు బెల్లంపల్లి పట్టణం విధ్వంసానికి గురవుతుందన్నారు. శాంతిఖని ఓసీ నిలిపివేసేందుకు MLA వినోద్, MPవంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలన్నారు. లేకపోతే OCలు బొందలగడ్డగా మారుతాయన్నారు.
News February 5, 2025
నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు
నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.