News March 19, 2025

నిర్మల్ : పరీక్షలకు 367మంది విద్యార్థులు గైర్హాజరు

image

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 367మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తo 6416మంది విద్యార్థులకు పరీక్షకు కేటాయించగా ఇందులో 6049 మంది విద్యార్థులు పరీక్ష  రాశారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News September 14, 2025

భువనగిరి: రేపు జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళా

image

ఈ నెల 15న జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన ఉత్తమ టీఎల్‌ఎంలను ప్రదర్శించాలని ఆయన సూచించారు. భువనగిరి కలెక్టరేట్ దగ్గరలోని ఏకే ప్యాలెస్‌లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమాచారాన్ని ఆయా మండల విద్యాధికారులు ఉపాధ్యాయులకు తెలియజేయాలని పేర్కొన్నారు.

News September 14, 2025

బాపట్ల జిల్లా మూడో ఎస్పీగా ఉమామహేశ్వర్

image

నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో మూడవ ఎస్పీగా ఉమామహేశ్వర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బాపట్ల జిల్లాలో తొలి ఎస్పీగా వకుల్ జిందాల్, రెండో ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు నిర్వహించి బదిలీ అయ్యారు. మూడో ఎస్పీగా ఉమామహేశ్వర్ ఆదివారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారని పోలీస్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నూతన ఎస్పీకి స్వాగతం పలికేందుకు పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టారు.

News September 14, 2025

రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు: MHBD SP

image

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌ సూచించారు. అవసరమైన యూరియా, ఇతర ఎరువులు అన్ని ప్రాంతాలకు పంపిణీ జరుగుతున్నాయన్నారు. అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి అన్ని మండలాలకు సరఫరా జరుగుతుందని, ప్రతి రైతుకు అవసరమైన యూరియా సంచులు అందజేయబడతాయని హామీ ఇచ్చారు. బైకులపై యూరియా బస్తాలు తీసుకెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణించాలని సూచించారు.