News February 24, 2026

నిర్మల్: పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైదరాబాద్ నుంచి, ఇంటర్మీడియట్, పదవతరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలిసి, అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

NZB: ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు

image

ఏడాదికి పైగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న NZB ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగిస్తూ వైద్య విద్య సంచాలకుడు (DME) నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డా.అయేషా ఫరీన్, డా.G.స్రవంతి, డా.P.నిశిత, డా.నీలకంఠం సతీశ్ రాజు, డా.R.లక్ష్మణ్, డా.M.అపూర్వ, Dr.P.లీలావతిలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News February 25, 2026

NRPT: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఎస్పీ

image

ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో బుధవారం నారాయణపేట పట్టణంలోని గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీఎస్పీ లింగయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతను సమీక్షించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అన్నారు.

News February 25, 2026

2 నుంచి శ్రీవారి కానుక వస్త్రాల వేలం

image

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు TTD అనుబంధ దేవస్థానాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలు(మొత్తం 287 లాట్లు) ఆన్‌లైన్ ఈ-వేలానికి ఉంచుతున్నారు. ఆర్ట్ సిల్క్ చీరలు, హాఫ్ శారీస్, సిల్క్ చీరలు, ఆర్డినరీ చీరలకు మార్చి 2వ తేదీ 9వ తేదీ వరకు AP ఈ-కొనుగోలు పోర్టల్‌లో EA ID Nos. 25597–25602, 25604–25609 ద్వారా వేలం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు AP ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.