News January 20, 2025

నిర్మల్: పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, కో ఆర్డినేటర్ గంగాధర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు గడువు జనవరి 25 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ 1,3,5 సెమిస్టర్ ఫీజు గడువు జనవరి 30 వరకు పొడిగించినట్లు చెప్పారు..

Similar News

News January 20, 2025

నార్నూర్ ఘాట్ రోడ్డు భద్రతపై ముందే హెచ్చరించిన Way2news

image

నార్నూర్ నుంచి మలంగి గ్రామానికి వెళ్లే దారిలో వచ్చే ఘాట్ రోడ్డు భద్రతపై Way2news ముందే  హెచ్చరించింది. ఇటీవల రోడ్డు ప్రమాదకర స్థితిలో ఉందని పలు కథనాలు ప్రచురించింది. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆదివారం ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రజలు Way2news కథనాలపై చర్చించుకున్నారు. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని పేర్కొంటున్నారు.

News January 20, 2025

బాసర: ఫిబ్రవరిలో వసంత పంచమి వేడుకలు

image

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ అర్చక వైదిక బృందం,అధికారులు ఫిబ్రవరి 01.02.2025 నుండి 03.02.2025 వరకు అమ్మవారికి విశేష పూజలు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించనున్నారు.

News January 20, 2025

నిర్మల్ కవులకు జాతీయ పురస్కారాలు

image

నిర్మల్ జిల్లాకు చెందిన కవులు జాతీయ పురస్కారాలను ఆదివారం అందుకున్నారు. కరీంనగర్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా గౌతమేశ్వర సాహితి కళాసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానంలో అంబటి నారాయణ సాహితీ రత్న, నేరెళ్ల హనుమంతుకు సాహితి కిరణం పురస్కారాలను అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు నిరంతరాయంగా కవిత్వాలను రాయడంతో అవార్డుకు ఎంపిక చేశామని వ్యవస్థాపకులు గౌతమేశ్వర తెలిపారు.