News July 7, 2025

నిర్మల్: పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత: కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఆమె నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆమె అన్నారు. “వనం ఉత్సవాలలో” భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అందరూ మొక్కలు నాటాలని కోరారు.

Similar News

News July 7, 2025

ఇండియన్ ముస్లింలు బందీలు.. సిటిజన్లు కాదు: ఒవైసీ

image

మైనార్టీలకే ఎక్కువ బెనిఫిట్స్, రక్షణలు ఉన్న ఏకైక దేశం ఇండియానే అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. అవి తమ హక్కులని, చారిటీ కాదని ట్వీట్ చేశారు. ‘మీరు మంత్రి.. చక్రవర్తి కాదు. పాకిస్థానీ, బంగ్లాదేశీ, జీహాదీ, రోహింగ్యా అని పిలిపించుకోవడం బెనిఫిట్ అంటారా? ఇండియన్ మైనారిటీలు కనీసం సెకండ్ క్లాస్ సిటిజన్స్ కూడా కాదు. మేము బందీలం’ అని వ్యాఖ్యానించారు.

News July 7, 2025

NGKL: విద్యుత్ శాఖ ఇన్‌ఛార్జ్ SEగా నరసింహారెడ్డి

image

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యుత్ ఇన్‌ఛార్జ్ SEగా నరసింహారెడ్డిని నియమిస్తూ సీఎండీ ముష్రఫ్ ఫారుకి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు అదనంగా ఎస్‌ఈ బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, జడ్చర్ల ప్రాంతాలలో ఆయన ఏడీఈ, డీఈగా నిర్వహించారు. మరోసారి జిల్లాకు రావడం పట్ల విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 7, 2025

బాపట్ల పీజీఆర్ఎస్‌లో 55 అర్జీల: ఎస్పీ

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ తుషార్ డూడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని సూచించారు.