News January 5, 2026
నిర్మల్: పుర పోరు.. సిద్ధమవుతున్న పార్టీలు

నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మోగకముందే రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS మున్సిపల్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తులు మొదలుపెట్టాయి. మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఛైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని ఆయా పార్టీల అధిష్ఠానాలు వ్యూహరచన చేస్తున్నాయి.
Similar News
News February 16, 2026
లాకర్లలోని 2.7 KGల బంగారాన్ని కొట్టేసిన అసిస్టెంట్ మేనేజర్.. ఎందుకంటే?

బెంగళూరులో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు అలవాటు పడ్డ ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కస్టమర్లకు చెందిన 2.7 KGల బంగారాన్ని (దాదాపు రూ.4 కోట్లు) కొట్టేశాడు. ఇండియన్ బ్యాంకుకు చెందిన కిరణ్ మేనేజర్ లేని సమయంలో తన లాకర్ యాక్సెస్‌తో కస్టమర్ల గోల్డ్ కొట్టేశాడు. దాన్ని తాకట్టు పెట్టి ఎంజాయ్ చేసేవాడు. ఓ మహిళ తన బంగారం కోసం రావడంతో గుట్టురట్టయింది. పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేసి 700 గ్రా. బంగారం రికవరీ చేశారు.
News February 16, 2026
తిరుణాళ్లకు వెళ్లొస్తూ చెరుకుపల్లిలో యువకుడి స్పాట్‌డెడ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చెరుకుపల్లిలో చోటుచేసుకుంది. గుళ్లపల్లికి చెందిన కామినేని అచ్చయ్య గోవాడ తిరునాళ్లకు వెళ్లాడు. తిరిగి చెరుకుపల్లి వస్తుండగా చెరుకుపల్లి ఊరి బయట ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అచ్చయ్యతో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న సుధాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు అచ్చయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు.
News February 16, 2026
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో SIకి గాయాలు

చౌటకూరు మండలం సరాప్ పల్లి గ్రామ శివారులో పోలీసు వాహనాన్ని వెనక వచ్చిన లారీ ఢీ కొట్టింది. వాహనంలో ఉన్న జోగిపేట ఎస్ఐ పాండుకు గాయాలయ్యాయి. జోగిపేట నుంచి సంగారెడ్డికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


