News April 22, 2025
నిర్మల్ : పోలీసులపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి: SP

ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని ఆయా కేసుల్లో నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెరిగేలా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పట్టణాల్లో దొంగతనాలు జరగకుండా రాత్రి వేళలో గస్తీని మరింత పెంచాలన్నారు.
Similar News
News April 22, 2025
TML: మే 1, 2న వాచీల ఈ-వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను మే 1, 2వ తేదీల‌్లో ఈ-వేలం వేయనున్నారు. టైటాన్, సిటిజన్, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్, ఇతర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని(వేలం) 0877-2264429 నంబరులో సంప్రదించాలి. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా వేలం జరుగుతంది.
News April 22, 2025
కామారెడ్డి: 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

ఈ నెల 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అచ్చంపేట్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కార్తీక సంధ్య తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ 6వ తరగతి పరీక్ష ఉదయం 10 నుంచి 12 వరకు, 7, 8, 9, 10 తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్లను telanagana.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 22, 2025
గద్వాల: క్విజ్ పోటీల్లో ఉత్తనూర్ విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్

గద్వాల బాల భవన్‌లో సోమవారం రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి క్విజ్ పోటీలు జరిగాయి. సైన్స్ విభాగంలో జరిగిన పోటీల్లో అయిజ మండలం ఉత్తనూర్ జడ్పీహెచ్ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అమరేశ్ మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు. డీఈవో అబ్దుల్ గని, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎస్తేరు రాణి, సైన్స్ ఆఫీసర్ పాపన్న చేతుల మీదుగా బహుమతి అందజేశారు. ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.