News March 17, 2025
నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

ఖానాపూర్ నుంచి మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్‌కు బస్సు బయల్దేరుతుందని వెల్లడించారు.
Similar News
News February 15, 2026
ఐఐఎఫ్‌టీ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర నిధుల విడుదల

యూ.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో ఐఐఎఫ్టీ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీనికి చెల్లించాల్సిన కేంద్ర బకాయిలు రూ.28.43 కోట్లు విడుదలకు ఎంపీ ఉదయ శ్రీనివాస్ కేంద్రంతో మాట్లాడారు. ఈ నిధులు విడుదలయ్యాయని ఎంపీ కార్యాలయం తెలిపింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెండింగ్ వాటా రూ.57.10 కోట్లు కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని దీంతో యూనివర్సిటీ ప్రారంభానికి ఆటంకాలు తొలగిపోయాయని తెలిపారు.
News February 15, 2026
ఘోరం.. 46 మందిని చంపేశారు!

నైజీరియాలో దారుణం జరిగింది. ISISతో సంబంధమున్న సాయుధ బందిపోట్లు మూడు గ్రామాల్లో అరాచకం సృష్టించారు. 40కి పైగా మోటార్ సైకిళ్లపై తిరుగుతూ కనిపించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కొందరి గొంతులను నరికేశారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ దాడుల్లో 30 నుంచి 46 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ఈ నెల 3న కూడా ఇలాంటి తరహా దాడుల్లో 162 మంది <<19053687>>మృతి చెందిన<<>> విషయం తెలిసిందే.
News February 15, 2026
కాకినాడ ఎస్పీ కార్యాలయంలోని రేపు పీజిఆర్ఎస్ రద్దు

రాష్ట్ర ప్రభుత్వం 16వ తేదీన(సోమవారం) సెలవు దినంగా ప్రకటించింది. దీంతో సోమవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం కార్యాలయానికి రావొద్దని సూచించారు.


