News January 17, 2026

నిర్మల్: ప్రతిపాదనలన్నింటికీ సీఎం ‘ఓకే’

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి భాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కోరిన పలు అభివృద్ధి పనులకు సానుకూలంగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తులపై సైతం సీఎం సానుకూలత వ్యక్తం చేస్తూ నిధులు మంజూరు చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని సీఎం ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Similar News

News February 4, 2026

రికార్డు స్థాయిలో UPI లావాదేవీలు: పంకజ్ చౌదరి

image

డిజిటల్ చెల్లింపులు జరిపేవారి సంఖ్య పెరగడంతో.. భారత UPI లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం DEC వరకు UPI ద్వారా రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని, భారత్ వెలుపలా UPI వినియోగం పెరగడం హర్షణీయమన్నారు.

News February 4, 2026

మొగిలిపేట ట్రాక్టర్ ప్రమాదం.. పెను విషాదం

image

మల్లాపూర్ మండలం మొగిలిపేటలో ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు రైతు కూలీలు మరణించారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో సంపంగి సాయమ్మ w/o ఎల్లయ్య(35), మంగళరపు లలిత w/o ధర్మరాజు (42), రోడ్డ వైష్ణవి D/O పోచయ్య(13), పెద్దిరెడ్డి గంగు w/o గంగాధర్ (45) అనే ముగ్గురు మహిళలు ఒక చిన్నారి మరణించడంతో గ్రామంలో పెను విషాదం నెలకొంది.

News February 4, 2026

నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని YCP అధినేత జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. రోడ్డు మార్గాన 11 గంటలకు గుంటూరులోని రాంబాబు ఇంటికి చేరుకుంటారు. అయితే గుంటూరు పరిధిలో 1861లోని సెక్షన్ 30 అమల్లో ఉందని, రాజకీయ ర్యాలీ, సమావేశం నిర్వహించడం, పాల్గొనడం నిషేధమని పోలీసు శాఖ పేర్కొంది.