News January 27, 2025
నిర్మల్: ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్

నిర్మల్ మున్సిపల్ ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సోమవారం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సహకరించాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, నిర్మల్ మున్సిపాలిటీను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమయానికి అన్ని రకాల పన్నుల వసూలు చేయాలన్నారు.
Similar News
News March 14, 2025
వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్ ఎంపికయ్యారు. గుత్తి మండలం బేతపల్లికి చెందిన వైసీపీ నేతలు సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తదితరులు మల్లయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మల్లయ్యను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సన్మానించారు. రైతుల సమస్యల పట్ల పోరాడుతానన్నారు. తనను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News March 14, 2025
ఎంటెక్ ఫలితాల విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పీ.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 14, 2025
నిర్మల్: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ

జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. నెలరోజుల శిక్షణ అనంతరం ప్రైవేట్ బ్యాంకులలో ప్లేస్మెంట్ కల్పిస్తారని, డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కన్న వయసు తక్కువగా ఉన్నవారు ఏప్రిల్ 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.