News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 7, 2026
ఇలాంటి వారితో సమాజానికి ఉపయోగం ఉండదు!

ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: విషపూరితంతో పాటు ఔషధ గుణాలున్న ముష్టి(Nux vomica) చెట్టు, చేదుగా ఉండే వేప చెట్టు వివిధ రూపాల్లో ఈ లోకానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ దయ లేని వాడు, దుర్మార్గుడు ఈ సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడడు. పైగా హాని చేస్తాడు.
<<-se>>#PADHYAM<<>>
News April 7, 2026
ఇంటర్నెట్‌లో నా వీడియోలు తీసేయించండి: MLA

ఇంటర్నెట్‌లో తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రైల్వే కోడూరు MLA శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. ఓ మహిళ తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వీడియోలు సోషల్ మీడియాతోపాటు ఛానళ్లలో వైరల్ అవుతున్నాయని, ఇవి తన ప్రతిష్ఠతకు భంగం కలిగిస్తున్నాయన్నారు. వీటిని ప్రసారం చేయకుండా చూడాలని ఆయన తరుఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. దీనిపై వివరాలు ఇవ్వాలని న్యాయమూర్తి కోడూరు పోలీసులను ఆదేశించారు.
News April 7, 2026
గోపాల్‌పేట: మైనర్‌పై అఘాయిత్యం.. యువకుడిపై కేసు నమోదు

గోపాల్‌పేట మండలంలోని ఓ గ్రామంలో మైనర్‌ను ప్రేమపేరుతో నమ్మించి, లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన శ్రీహరి అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. ఏడాదిగా మాయమాటలతో బాలికను లొంగదీసుకున్న నిందితుడు, పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు POCSO కింద కేసు నమోదైంది.


