News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 30, 2026
ఆదిలాబాద్: ఆపదలో ‘అపర సంజీవని’

ఉమ్మడి జిల్లాలో ‘108’ సేవలు లక్షలాది మందికి ప్రాణభిక్ష పెడుతున్నాయి. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల మధ్య సకాలంలో వైద్యం అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. నెలకు సుమారు 8 వేల మందికి పైగా బాధితులను సురక్షితంగా ఆస్పత్రులకు చేరుస్తున్నాయి. గర్భిణులను, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందిస్తూ నిరంతరం బాధితుల పాలిట కొంగుబంగారంలా నిలుస్తున్నాయి.
News March 30, 2026
పాలమూరు: 6th క్లాస్ విద్యార్థినికి RTC ఉద్యోగం.. రేషన్ కట్..!

రేషన్ కార్డుల ఏరివేతలో అధికారుల అత్యుత్సాహం సామాన్యులకు శాపంగా మారింది. అచ్చంపేట(M) ఘనపూర్‌కు చెందిన బొడ్డుపల్లి మల్లేశ్, లిఖిత రేషన్ కోసం వెళ్లగా కార్డు రద్దయిందని తెలిసింది. విచారించగా ఇంట్లోని 6th క్లాస్ విద్యార్థినికి RTC ఉద్యోగం ఉందనే నెపంతో కార్డును తొలగించారు. విద్యార్థినికి ఉద్యోగం ఎలా సాధ్యమని ఆయన వాపోతున్నాడు. సాంకేతిక లోపమని అధికారులు చెప్పారు. కార్డు వెంటనే పునరుద్ధరించాలని ఆయన కోరారు.
News March 30, 2026
గాజువాకలో ప్రియురాలి హత్యకు కారణాలివేనా..?

నేవీలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న <<19511826>>రవీంద్ర<<>>(35), భార్య నెల రోజుల క్రితమే VZMలోని పుట్టింటికి వెళ్లారు. దీంతో ప్రియురాలు మౌనికను ఆదివారం రాత్రి గాజువాక ఎల్.వీ.నగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు పిలిచాడు. ముక్కలుగా చేసి మూటకట్టి ఫ్రిజ్‌లో పెట్టాడు. అనంతరం గాజువాక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


