News November 19, 2025

నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

image

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. ADBకు 33వ ర్యాంకు

image

ఇంటర్ సెకండియర్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదిలాబాద్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 7,518 మంది పరీక్షలు రాయగా 4,699 మంది పాసై 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 905 మందికి 669 మంది పాసై73.95 శాతంతో 18వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 452 మందికి 162 మంది పాసై 35.84%తో 8వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 53 మందికి 15 మంది పాసై 28.30%తో 34వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. నిర్మల్‌కు 12వ స్థానం

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో NRML జిల్లా 62.93% ఉత్తీర్ణతతో 12వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 5,778 మంది పరీక్ష రాయగా, 3,636 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,773 మందికి 1,391 మంది (36.87%) పాస్ అయ్యారు. బాలికలు 3,928 మందికి గాను 2,519 మంది (64.13%) ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఒకేషనల్‌లో 873 మంది పరీక్ష రాయగా 469 మంది విద్యార్థులు పాసై 53.72శాతంతో స్టేట్‌లో 29వ స్థానంలో నిలిచింది.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. మెదక్ 26వ స్థానం

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మెదక్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4826 మంది పరీక్షలు రాయగా 3310 మంది పాసై 68.59 శాతంతో స్టేట్‌లోనే 26వ స్థానం వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 539 మందికి 460మంది పాసై 85.34 శాతంతో 3వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 649 మందికి 187 మంది పాసై 28.81%తో 28వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో16 మందికి 11 మంది పాసై 68.75%తో 1వ ప్లేస్ వచ్చింది.