News March 5, 2025
నిర్మల్: బడులకు ల్యాప్‌టాప్‌లు వచ్చాయ్…!

జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన ల్యాప్‌టాప్‌లను మంగళవారం డీఈవో రామారావు ఉపాధ్యాయులకు అందజేశారు. జిల్లాలో 20 పాఠశాలలు ఎంపిక కాగా 17 పాఠశాలలకు టింకరింగ్ ల్యాబ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వీటి కింద 17 పాఠశాలలకు ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు వచ్చాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News March 5, 2025
SLBC కార్మికుల కోసం జాగిలాలతో అన్వేషణ

TG: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషించారు. కానీ వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లోపలికి పంపి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడివేయాలని భావిస్తున్నారు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. రెండో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
News March 5, 2025
రామారెడ్డి ఆలయంలో హీరో శ్రీకాంత్ సందడి

రామారెడ్డి మండలం ఈస్సన్నపల్లి గ్రామంలో గల కాలభైరవ స్వామి ఆలయంలో సినీ నటుడు శ్రీకాంత్ దంపతులు పూజలు నిర్వహించారు. మంగళవారం పురస్కరించుకొని కుటుంబ సమేతంగా వారు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారి వారికి తీర్థప్రసాదాలను వితరణ చేశారు. ఆయనను చూడటానికి అక్కడి ప్రజలు గుమిగూడారు.
News March 5, 2025
రాష్ట్రంలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. 4,88,448 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచ్‌లపై నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.