News October 6, 2025
నిర్మల్: బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి

నిర్మల్ జిల్లాలో జరిగిన బతుకమ్మ వేడుకలు విషాదాన్ని నింపాయి. బతుకమ్మ కోసం వినియోగించిన డీజే కారణంగా బంగల్ పేట్‌కు చెందిన భాగ్యలక్ష్మి (56) గుండెపోటుతో మరణించారు. శనివారం రాత్రి డీజే శబ్దాల మధ్య బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స నిర్వహిస్తుండగానే మృతి చెందారు. డీజే సౌండ్ కారణంగా గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.
Similar News
News October 6, 2025
UPI లావాదేవీల్లో సమస్యలొస్తే ఇలా చేయండి1/2

క్యాష్‌లెస్ పేమెంట్స్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలో UPI, ఆన్‌లైన్ పేమెంట్స్‌లో సమస్యలెదురైతే ఇలా చేయండి. డబ్బు పంపే సమయంలో మన అకౌంట్‌లో డెబిట్ అయినా అవతలి వారికి చేరదు. ఇంటర్-బ్యాంక్ సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరగొచ్చు. 3 రోజుల్లో డబ్బు తిరిగి రాకపోతే మీరు వాడిన <<17922440>>UPI<<>> యాప్ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా NPCI పోర్టల్‌లో కంప్లైంట్ ఇవ్వాలి. SHARE IT
News October 6, 2025
UPI పిన్ మర్చిపోయారా? ఇలా చేయండి 2/2

చాలా మంది UPI పిన్‌ను మర్చిపోయి పేమెంట్స్ చేసే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో మీ UPI యాప్‌లో “Forgot UPI PIN” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ డెబిట్ కార్డు వివరాలను (చివరి 6 అంకెలు, గడువు తేదీ) ఉపయోగించి కొత్త పిన్‌ను సెట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు UPI పిన్‌ను లేదా OTPని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. UPI యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.
News October 6, 2025
మెదక్: జిల్లాను వదలని వాన.. భారీ వర్షం

మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా వర్షాలు జిల్లాలో వదలడం లేదు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్‌లలో నమోదైన వర్షపాతం వివరాలు.. కొల్చారం 65.3 మిమీ, అల్లాదుర్గం 58.8, పెద్ద శంకరంపేట 57.0, మిన్పూర్ 47.3, టేక్మాల్ 46.3, లింగంపల్లి 44.8, చిన్న శంకరంపేట 44.5, బుజరంపేట 38.3, కౌడిపల్లి 34.5, చిట్కుల్ 22.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.