News January 13, 2026

నిర్మల్: బల్దియాల్లో మహిళా ఓటర్లే అధికం

image

నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపల్ పరిధిలో తుది ఓటరు జాబితా విడుదలైంది. దింతో ఈ మూడు మున్సిపాల్టీల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. భైంసాలో 26 వార్డుల్లో 25,623, నిర్మల్ 42 వార్డుల్లో 50,824, ఖానాపూర్‌లో 9,168 మంది మహిళ ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా మున్సిపాల్టీ పరిధిలో ఇక రిజర్వేషన్ల ఖరారు కోసం బరిలో నిలిచే ఆశవహులైన మహిళలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News January 21, 2026

నేడు లలితా వ్రతం ఆచరిస్తే సకల సంపదలు

image

నేడు మాఘ శుద్ధ తదియ. ఈరోజు ‘లలితా వ్రతం’ ఆచరించడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు. లలితా దేవిని షోడశోపచారాలతో పూజించి, ఎర్రటి పుష్పాలు, కుంకుమతో అర్చన చేస్తారు. వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం, కన్యలు ఉత్తమమైన వరుడు లభించాలని ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠతో చేస్తారు. శక్తి స్వరూపిణి అయిన లలితా పరాభట్టారికను ధ్యానిస్తూ లలితా సహస్రనామ పారాయణ చేస్తే పాపాలన్నీ తొలగి, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

News January 21, 2026

ASF: నిరుద్యోగుల కోసం మినీ జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న జిల్లా కేంద్రంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి ఏ.రవికృష్ణ తెలిపారు. జంకాపూర్‌లోని పాత కలెక్టరేట్ కార్యాలయంలో గల టాస్క్ (TASK) శిక్షణ కేంద్రంలో ఈ మేళా జరుగుతుంది. ఆసక్తి గల యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9392310323, 7989733511, 9160608476 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

News January 21, 2026

టోల్‌ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్

image

హైవేలపై టోల్ చెల్లింపుల విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. టోల్ ఫీ పెండింగ్ ఉన్న వాహనాలకు ఇకపై వెహికల్ ఓనర్‌షిప్‌కు అవసరమైన NOC, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్, నేషనల్ పర్మిట్ లభించదని స్పష్టం చేసింది. చాలా సందర్భాల్లో వాహనదారులకు తెలియకుండానే బకాయిలు ఏర్పడే అవకాశముంది. టోల్‌ప్లాజా వద్ద టెక్నికల్ సమస్యల వల్ల మనీ కట్ అవ్వకపోవడం కూడా టోల్ ఫీ పెండింగ్‌గా చూపించే అవకాశముంది.