News March 11, 2025

నిర్మల్: ‘బాలశక్తితో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు’

image

జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి అందించిన వాహనాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహోన్నతమైన బాలశక్తి కార్యక్రమానికి ఈ వాహనం, విద్యార్థుల సంక్షేమానికి, ఆరోగ్య సంరక్షణకు దోహదం చేస్తుందన్నారు.

Similar News

News April 1, 2026

జలవివాదాల్లో జోక్యం చేసుకోలేం: కృష్ణా బోర్డు

image

తెలుగు రాష్ట్రాల జలవివాదాల్లో జోక్యం చేసుకోలేమని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. నీటి పంపిణీపై ప్రస్తుతం జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌లో విచారణ జరుగుతోందని.. ఇప్పుడు జోక్యం చేసుకుంటే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. శ్రీశైలం-నాగార్జున సాగర్‌లోని కృష్ణా జలాల వాడకం, విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని నిలువరించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఈ మేరకు స్పందించింది.

News April 1, 2026

ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి రేషన్‌

image

ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి రేషన్‌ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సరుకుల అందజేతకు అన్ని చర్యలు తీసుకున్నారు. బుధవారం నుంచి రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసరాలు ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయంలో కార్డుదారులకు బియ్యం, చక్కెర గోధుమపిండిని అందజేస్తారు.

News April 1, 2026

ఉమ్మడి అనంత జిల్లాలో గ్యాస్ కష్టాలు: మంత్రి సవిత క్లారిటీ

image

గ్యాస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. మంగళవారం పెనుకొండలో ఆమె మాట్లాడారు. ఎప్పటిలాగే ఇండెంట్ పెట్టిన వారందరికీ సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తారన్నారు. యుద్ధం నేపథ్యంలో భవిష్యత్తులోనూ ఇబ్బందులు రాకూడదని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు.