News March 5, 2025

నిర్మల్ : ‘బాలశక్తి కార్యక్రమాన్ని పగడ్బందీగా కొనసాగించాలి’

image

బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేకంగా అమలుపరుస్తున్న బాలశక్తి కార్యక్రమాన్ని మెరుగ్గా అమలుపరచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వైద్య పరీక్షల నిర్వహణ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలన్నారు.

Similar News

News April 5, 2026

TDPలోనే ఉంటాం: నెల్లూరు MP

image

జగన్‌ను కలిసే విషయయై YCP రాజ్యసభ MP అయోధ్య రామిరెడ్డితో నెల్లూరు MP వేమిరెడ్డి చర్చించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘మాకు కావాల్సింది గౌరవం. TDP ప్రభుత్వంలో చాలా గౌరవంగా ఉన్నాం. ఇదే పార్టీలోనే కొనసాగుతాం. రాజధానిపై YCPకి స్పష్టతలేదు. మావిగన్ అంటే జనాలు నవ్వుతున్నారు. తమిళనాడు బోట్లను అడ్డుకోవడానికి త్వరలో నెల్లూరుకు 2, తిరుపతి, బాపట్లకు ఒక్కోటి చొప్పున బోట్లు ఇస్తాం’ అని వేమిరెడ్డి చెప్పారు.

News April 5, 2026

నేడు SRH మ్యాచ్.. HYDకు వర్షసూచన ఉందా?

image

IPL: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ SRH, LSG తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో HYD వాతావరణ కేంద్రం అప్డేట్ ఇచ్చింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురు గాలులతో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. SRH మ్యాచ్ 3.30 గంటలకు కావడంతో వర్షం పడినా పెద్దగా అంతరాయం కలగకపోవచ్చు. ఇవాళ SRH, LSGలలో ఏ జట్టు గెలుస్తుంది?

News April 5, 2026

రంగారెడ్డి: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ!

image

రంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు SBI RSETI సువర్ణావకాశం కల్పిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఏప్రిల్ 13 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు పూర్తయ్యాక ఉచితంగా టూల్‌కిట్ అందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 7981951167, 9963562266 నంబర్లలో సంప్రదించాలన్నారు.