News February 25, 2026
నిర్మల్: బాల్య వివాహాలను సమన్వయంతో అడ్డుకోవాలి: కలెక్టర్

గత సంవత్సరం 45, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 2 బాల్యవివాహాలను అడ్డుకున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాల్యవివాహాల సమాచారం అందిన వెంటనే సంక్షేమ, పోలీసు, విద్యాశాఖలు సమన్వయంతో అడ్డుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, నిర్ణీత వయస్సు వచ్చే వరకు వివాహం జరపమని ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలన్నారు. బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు.
Similar News
News February 28, 2026
ఏలూరు: 2,57,658 మందికి పెన్షన్లు పంపిణీ

ఏలూరు 17వ డివిజన్ గాంధీ మైదాన ప్రాంతంలో శనివారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 2,57,658 మందికి రూ.113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేసామన్నారు. ఇందుకు జిల్లాలో 5047 మంది వార్డు, గ్రామ సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బందితో పింఛన్లు పంపిణీ పక్కా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
News February 28, 2026
రాంబిల్లి: ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కారణాలు

ఏపీలో పెట్టుబడులు పెట్టాడానికి కారణాలను మంత్రి లోకేష్ వివరించారు. స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ లో ఒక్కసారి మాతో ఒప్పందం చేసుకుంటే అది మా సొంత ప్రాజెక్టుగా భావిస్తామన్నారు. పెట్టుబడిదారులను బయట వ్యక్తులుగా కాకుండా అభివృద్ధి భాగస్వామ్యులుగా చూస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మాట ఇస్తే నిలబెట్టుకుంటామని ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత ఉందన్నారు. అలాగే డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ గా పేర్కొన్నారు.
News February 28, 2026
ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

ASF జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 31 వరకు ’30 పోలీస్ యాక్ట్-1861′ అమలులో ఉంటుందని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.


