News March 24, 2024
నిర్మల్: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్…!

నిర్మల్ జిల్లా నాయకులు BRSను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ మాజీ మండల అధ్యక్షులు ఆయిండ్ల పోశెట్టి, మంజులాపూర్ మాజీ సర్పంచ్ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి మంత్రి ఆహ్వానించారు.
Similar News
News October 24, 2025
ADB: జిల్లాస్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులు

ఆదిలాబాద్ జిల్లా స్థాయి యువజనోత్సవాలను నవంబర్ 4న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల యువత ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పాటలు, వక్తృత్వం, శాస్త్రీయ నృత్యం, క్విజ్, ఫోక్ సాంగ్స్ వంటి ఏడు అంశాలలో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు నవంబర్ 3 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, పోటీలు డీఆర్డీఏ మీటింగ్ హాలులో జరుగుతాయని వివరించారు.
News October 24, 2025
ఆదిలాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించిందని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. అక్టోబరు 30 నుంచి నవంబర్ 13 లోపు పాఠశాల హెడ్మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు అందించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు అవకాశం ఉందన్నారు.
News October 23, 2025
5K రన్ విజయవంతం చేయండి: ఆదిలాబాద్ SP

ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అమరవీరుల జ్ఞాపకార్ధం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు 5k రన్ నిర్వహించనున్నట్లు SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ప్రజలు, యువత, విద్యార్థులు, పోలీసు శ్రేయోభిలాషులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్టేడియం నుంచి ప్రారంభమై కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, వినాయక చౌక్, నేతాజీ చౌక్, అంబేడ్కర్ చౌక్ మీదుగా తిరిగి స్టేడియం చేరుకుంటుందన్నారు.


