News February 18, 2026
నిర్మల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తులు

2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకం కింద పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి దయానంద్ తెలిపారు. ఆసక్తి గల ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మార్చి 25లోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి రూ.28 వేల నుంచి రూ.42 వేల వరకు చెల్లిస్తామన్నారు.
Similar News
News February 19, 2026
ఫిబ్రవరి 19: చరిత్రలో ఈరోజు

1473: ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ జననం
1630: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జననం
1915: స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం
1930: సినీ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ జననం
2009: తెలుగు నటి నిర్మలమ్మ మరణం
2018: హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణం
News February 19, 2026
NCERT ‘ఇ-మ్యాజిక్ బాక్స్’.. AIతో ఇక సరదాగా చదువు

3 నుంచి 8 ఏళ్ల చిన్నారుల కోసం NCERT సరికొత్త AI ఆధారిత ‘ఇ-మ్యాజిక్ బాక్స్’ యాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో కథలు చెప్పే ‘కథా సఖి’, తల్లిదండ్రుల సందేహాలు తీర్చే ‘పేరెంట్ తార’, ఉపాధ్యాయులకు బోధనలో సాయపడే ‘టీచర్ తార’ అనే 3 స్మార్ట్ బాట్‌లు ఉన్నాయి. ఆటపాటల ద్వారా పిల్లల్లో క్రియేటివిటీని పెంచడంతో పాటు వారు అడిగే ప్రశ్నలకు ఈ యాప్ వెంటనే AI సాయంతో సమాధానాలిస్తుంది.
News February 19, 2026
NTR: BREAKING.. ACBకి చిక్కకుండా SI ఎస్కేప్!

పోక్సో కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసిన NTR జిల్లా వత్సవాయి SI ఉమామహేశ్వరరావు ACB దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం బాధితుడు డబ్బుతో స్టేషన్‌కు రాగా, బయట కొత్త వ్యక్తులను గమనించిన కానిస్టేబుల్ SIని అప్రమత్తం చేశారు. దీంతో SI అక్కడి నుంచి హుటాహుటిన పరారయ్యారు. పక్కా ప్లాన్‌తో వచ్చిన ACB అధికారులు, SI చాకచక్యంగా తప్పించుకోవడంతో ఖంగుతిన్నారు.


