News February 23, 2025

నిర్మల్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. లోకేశ్వరం పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్ జిల్లా పిప్పల్గాంకు చెందిన బీరప్ప(42), బోధన్ మండలం కందుర్‌కు చెందిన లక్ష్మితో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. భార్య కాపురానికి రానని చెప్పడంతో లోకేశ్వరం మండలంలోని మన్మద్ X రోడ్డు సమీపంలో ఉరేసుకొన్నాడు.

Similar News

News December 30, 2025

సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు కీలక రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం-తిరుపతి, విశాఖ-బెంగళూరు, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ వంటి 9 జతల రైళ్లకు జనవరి 1 నుండి వివిధ తేదీల్లో అదనపు ఏసీ, స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రశాంత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనపు 3rd AC కోచ్‌ను కూడా చేర్చారు.

News December 30, 2025

పెద్దహరివాణం మండలం పేరు మార్పుపై ఉద్రిక్తత

image

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద హరివాణం గ్రామంలో ఆందోళన తీవ్రతరమైంది. మంగళవారం సిరుగుప్ప, ఆదోని రోడ్డుపై స్థానికులు వందలాదిమంది బైఠాయించి టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు.పెద్దహరివాణం మండలంగా గత నెలలో నోటిఫికేషన్ వచ్చిందన్నారు. పెద్దహరివాణంకు బదులుగా ఆదోని మండలంను ఒకటి, రెండుగా విభజించి ప్రకటించడం తగదని ఆగ్రామంలో నాయకుడు ఆదినారాయణ రెడ్డి నిరవధిక దీక్షకు పూనుకున్నారు.

News December 30, 2025

జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకం: మెదక్ అదనపు కలెక్టర్

image

పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకమని అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ అన్నారు. సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు. పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలన్నారు.