News October 19, 2025
నిర్మల్: మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు

మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ప్రకటించారు. బీసీ బంద్, బ్యాంకుల బంద్ కారణంగా దరఖాస్తులు వేయలేని ఆశావహుల విజ్ఞప్తి మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఈ గడువును పెంచారు. అక్టోబరు 27న లక్కీ డ్రా నిర్వహిస్తామని, కావున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Similar News
News October 21, 2025
మీ నిస్వార్థ సేవకు సలామ్!❤️

దీపావళికి లక్ష్మీ పూజకు ఏర్పాట్లు చేస్తోన్న ఓ మహిళా డాక్టర్‌కు ‘ఎమర్జెన్సీ’ అని ఫోన్ వచ్చింది. మిగతా డాక్టర్లు సెలవులో ఉండటంతో ఆమె పూజను వదిలి తన బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చారు. పిండంలో కదలికలు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడారు. తన ఇంట్లో లక్ష్మిని వదిలి వచ్చినా.. మరో ఇంటి లక్ష్మీదేవికి ప్రాణం పోశానంటూ ఆమె ట్వీట్ చేశారు. నిస్వార్థంగా సేవచేసే వైద్యులకు సలామ్!
News October 21, 2025
కవిటి: ఆ గ్రామం ఆదర్శం..!

కవిటి (M) పొందూరు పుట్టుగ గ్రామం దీపావళి పండగకు దూరంగా ఉంది. కారణం ఏమిటంటే..? ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు దూగాన రామ్మూర్తి (44), ప్రణయ్ (17) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి నాడు బాధిత కుటుంబంలో అమావాస్య చీకట్లు అల్లుకున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
News October 21, 2025
వంటింటి చిట్కాలు

* ఫ్రిడ్జ్‌లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను మెంతులు, అటుకులు వేయాలి.
* కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఎండుకొబ్బరి చిప్పను ఆ డబ్బాలో ఉంచాలి.