News October 12, 2025

నిర్మల్: మద్యం షాపుల రిజర్వేషన్లు ఖరారు

image

జిల్లాలో వైన్స్ షాపులకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 47 మద్యం దుకాణాల్లో ఎస్టీ 1, గౌడ 3, ఎస్సీ 5 వైన్ షాపులు కేటాయించారు. ఎస్టీ -నర్సాపూర్ (జి)షాపు నెం.2, గౌడలకు – నిర్మల్ షాపు నెం.1, పెంబి, కుబీర్ షాపు నెం.1, ఎస్సీలకు – తానూర్, సొన్ షాపు నెం.2, సారంగాపూర్ షాపు నెం.1, కడెం షాపు నెం.1, భైంసా షాపు నెం.5 కేటాయించారు. ఆసక్తి గలవారు ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News October 12, 2025

తిరుపతి : ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ప్రాజెక్టులో భాగంగా కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పేర్కొంది. మొత్తం 10 విభాగాలలో 56 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 22.

News October 12, 2025

APలో బీచ్‌కెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

image

బాపట్లలోని చీరాల బీచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. AP పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ అమరావతిలోని విట్‌లో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో గల్లంతు అయ్యారు. గాలింపు చేపట్టగా శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యమయ్యాయి.