News June 22, 2024

నిర్మల్: మద్యానికి బానిసై ఆత్మహత్య

image

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కీర్గుల్ కే గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కదం గంగాధర్ (45) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. జీవితం మీద విరక్తితో రోడ్డమోడ్ గుట్ట వద్ద గల చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 2, 2025

ఇంద్రవెల్లి: జనవరి 28 నుంచి నాగోబా జాతర

image

ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నిర్వహించే నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతరపై గురువారం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా దర్బార్ హాల్లో జిల్లా అధికారులు, దేవాదాయ, దేవాలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జాతరకు లక్షలాది మంది ఆదివాసీలు, గిరిజనులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.

News January 2, 2025

ADB: పెద్దపులి దొరికిందోచ్..!

image

ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. సిర్పూర్(టి) మాకిడి అటవీ ప్రాంతానికి 7కి.మీ దూరంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఆత్మారాంగుడా సమీపంలో అక్కడి ఫారెస్ట్ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. కాగా గతేడాది నవంబర్ 29న కాగజ్‌నగర్ గన్నారంలోని ఓ పొలంలో పనులు చేస్తున్న లక్ష్మిపై పులి దాడి చేసింది. కాగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

News January 2, 2025

విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాలి: ASF కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. బుధవారం టీఎస్‌యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజ నిర్మాణం తరగతి గదిలోనే ప్రారంభమవుతుందన్నారు. సామాజిక స్పృహ కలిగిన సంఘంగా కొత్త ఏడాదిలో నవ ఉత్తేజంతో పనిచేయాలని సూచించారు.