News April 24, 2025
నిర్మల్: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు

నిర్మల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ పురుషుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.బట్టు విజయ్ కుమార్ తెలిపారు. డిగ్రీ కళాశాలలో B.Sc, B.Com, BBA, BA విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు మే 5 లోపు కళాశాలకి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 24, 2025
పాకిస్థానీల వీసాలన్నీ రద్దు

ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రజలకు ఇచ్చిన వీసాలన్నింటినీ భారత విదేశాంగ శాఖ రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు ఈ APR 27 వరకు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేసింది. ఇక మెడికల్ వీసాలతో భారత్‌లో ఉన్నవారు ఏప్రిల్ 29 లోపు వెళ్లిపోవాలని పేర్కొంది. మరోవైపు భారతీయులెవరూ పాక్‌కు వెళ్లొద్దని చెప్పడంతో పాటు ఇప్పటికే ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వీలైనంత త్వరగా తిరిగి రావాలని సూచించింది.
News April 24, 2025
జిల్లాలో జూన్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ: కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జూన్ మొదటి వారం వరకు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో డీఆర్డీఏ ఐకేపీ ద్వారా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు.
News April 24, 2025
ఎన్టీఆర్: విద్యార్థులను అభినందించిన కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ లక్ష్మీశ, డీఈఓ సుబ్బారావు గురువారం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా అభినందించారు. 598 మార్కులతో జిల్లాలో మొదటి స్థానం సాధించిన కొల్లి స్వాతి, నంది 593, సాయి చరణ్, ప్రనీత్‌లను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.