News March 6, 2025

నిర్మల్: ‘మహిళల ఎదుగుతలకు చేయూతనందించాలి’

image

మహిళలు ఎదుగుదలకు చేయూతని ఇవ్వవలసిన అవసరం ఉందని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. భేటీ బచావో.. బేటి పడావో దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీలతో సమావేశం నిర్వహించారు. ఈ పథకం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 45 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సీనియర్ సివిల్ జడ్జి రాధిక, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 12, 2026

IPL: ఢిల్లీ చెత్త రికార్డు

image

CSKతో మ్యాచ్‌లో <<19628621>>ఓడిన<<>> ఢిల్లీ క్యాపిటల్స్‌ IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక సార్లు(31) ఆలౌట్ అయిన జట్టుగా తన స్థానాన్ని మరింతగా ‘మెరుగు’పరుచుకుంది. ఈ లిస్టులో PBKS(27), RCB(26) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు చెపాక్ స్టేడియంలో ఢిల్లీతో ఆడిన 9 మ్యాచుల్లో 8 సార్లు CSK గెలిచింది. ఇదే స్టేడియంలో వరుసగా 6 ఓటముల తర్వాత చెన్నైని విజయం వరించింది.

News April 12, 2026

NTR ‘డ్రాగన్‌’లో విలన్‌గా బాలీవుడ్ హీరో?

image

NTR, నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీపై ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. విలన్‌గా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తొలుత మలయాళ నటుడు టొవినో థామస్‌ను తీసుకోవాలని భావించారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో తాను <<19526769>>నటించడం లేదని<<>> టొవినో క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో షాహిద్‌ను తీసుకునేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 12, 2026

ఇరాన్‌పై పోరాటం కొనసాగిస్తాం: నెతన్యాహు

image

ఇరాన్‌ టెర్రర్ పాలన, దాని మిత్రపక్షాలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టంచేశారు. తమ సరిహద్దుల వెంబడి ఉగ్ర సంస్థల ఉనికిని సహించబోమని హెచ్చరించారు. శత్రు భూభాగంలో సెక్యూరిటీ జోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కుర్దిష్ పౌరులపై సామూహిక హత్యాకాండకు ఆయనే బాధ్యుడని ఆరోపించారు.