News February 27, 2026
నిర్మల్: ‘మార్చి 4లోపు దరఖాస్తు చేసుకోండి’

జిల్లాలోని కేజీబీవీలలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నిరుద్యోగ మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భోజన తెలిపారు. ఏఎన్ఎం పోస్టు బైంసాలో, అకౌంటెంట్లు ఖానాపూర్, దస్తురాబాద్‌లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని, రోస్టర్ ప్రాతిపదికన నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక ఎంఈఓ కార్యాలయాల్లో మార్చి 4లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News February 27, 2026
చిన్నగంజాంలో విద్యుత్ షాక్‌కి గురై వ్యక్తి మృతి

చిన్నగంజాంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఉప్పు కొట్టారులో పనిచేస్తున్న పలబోలు శ్రీకాంత్ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. తన సొంత ఉప్పు కొట్టారులో మోటార్ వద్ద కరెంట్ వైర్ బిగించే సమయంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలినట్లు సమాచారం. మృతుడికి భార్యతో పాటు పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో సోపిరాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News February 27, 2026
ట్రాఫిక్ రూల్స్ కఠినం చేయండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. అవసరమున్న చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేయాలన్నారు. రోడ్లపై పశువుల సంచారం విచ్చలవిడి కావడంతో ప్రమాదాలు జరుగుచున్నాయని, యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.
News February 27, 2026
అభిషేక్ పోస్ట్.. చెప్పు చూపించిన యువీ!

T20WC: నిన్నటి మ్యాచ్‌లో రాణించడాన్ని యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇన్‌స్టా పోస్ట్‌తో సెలబ్రేట్ చేసుకోగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. అభిషేక్ పోస్టుకు సరదాగా ఓ చెప్పు ఎమోజీని పెట్టారు. గతంలోనూ యువీ అభిషేక్‌కు ఈ తరహా ఎమోజీలు పెట్టారు. ఆటపై మరింత దృష్టిపెట్టాలని హెచ్చరించడమే దీని ఉద్దేశం. మరోవైపు అభిషేక్ ప్రదర్శనను మెచ్చుకుంటూ ఇన్‌స్టాలో యువరాజ్ స్టోరీ పోస్ట్ చేశారు.


