News February 21, 2026

నిర్మల్: ముగిసిన ఎన్నికలు.. అందని భరోసా!

image

రబీ సాగు పెట్టుబడుల కోసం నిర్మల్ జిల్లా రైతాంగం రైతు భరోసా నిధుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ నిధులు, మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం అయ్యాయి. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, వారం గడుస్తున్నా అతీగతీ లేదు. జిల్లాలోని లక్షకు పైగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 21, 2026

కెరీర్ గైడెన్స్.. కాల్ చేసి సరైన మార్గాన్ని ఎంచుకోండి!

image

టెన్త్, ఇంటర్ తర్వాత ఏం చేయాలనే సందేహంలో మీ పిల్లలున్నారా? అలాంటి వారికి సరైన మార్గాన్ని సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. విద్యార్థులు భవిష్యత్తులో సరైన కోర్సులను ఎంచుకునేందుకు 1800 425 2428 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు. ఆదివారం మినహా ప్రతిరోజూ 9AM నుంచి 6PM వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. SHARE IT

News February 21, 2026

గౌతమ్.. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను: జగన్

image

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేడు. ఈనేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న బంధాన్ని మాజీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘డియర్ గౌతమ్.. మన స్నేహంతో కూడిన మధురమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు నాకు స్నేహితుడే కాదు సోదరుడివి. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతావు’ అంటూ జగన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.

News February 21, 2026

మెదక్‌లో అర్ధరాత్రి విచక్షణారహితంగా దాడి

image

మెదక్‌లోని శ్మశానవాటిక సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సజీద్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఈఎంటీ రామవ్వ, పైలట్ రఘు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. టౌన్ SI రుక్సానా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.