News January 25, 2026

నిర్మల్: మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జీలు

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. భైంసాకు హైదరాబాద్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, నిర్మల్‌కు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను, ఖానాపూర్‌కు సీనియర్ నేత అబ్దుల్ ముజీబ్‌ను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు వరకు క్షేత్రస్థాయిలో వీరు పార్టీని సమన్వయం చేయనున్నారు. నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఈ నియామకాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Similar News

News March 12, 2026

అనంతపురం జిల్లాకు 24వ ర్యాంకు

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. సంక్షేమ పథకాలు, అధికారుల పనితీరుపై అనంతపురం జిల్లా రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 64.6 నుంచి 66.6 శాతానికి పెరిగింది. పనితీరులో మరింత పురోగతి సాధించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

News March 12, 2026

పారిశ్రామిక హబ్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి చూశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ‘అభివృద్ధి కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా దీర్ఘకాలంలో వాటి ఫలితాలను చూస్తాం’ అని పేర్కొన్నారు.

News March 12, 2026

ఎనుమాములలో కల్తీ కారం పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కల్తీ కారంను పట్టుకున్నారు. స్థానిక సాయి ఓ ఇండస్ట్రీలో కల్తీ కారం తయారు చేస్తుండగా పక్కా సమాచారంతో వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. రూ.4లక్షల విలువ గల నిల్వ చేసిన కారంను స్వాధీనం చేసుకున్నారు. ఇండస్ట్రీ నిర్వాహకుడు సురేశ్‌ను స్థానిక ఎనుమాముల పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.