News January 5, 2026

నిర్మల్: మున్సిపల్ రేసులో పెరగనున్న ఎన్నికల వేడి

image

జిల్లాలోని 3 మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. తాజా గణాంకాల ప్రకారం NRMLలో 98,295, భైంసా 51,118, ఖానాపూర్‌లో 17,693 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం పెరగడం, పాత వార్డుల్లో కుటుంబాల విస్తరణతో తుది జాబితా నాటికి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓట్ల సంఖ్య పెరిగితే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై అదనపు భారం పడనుంది.

Similar News

News January 30, 2026

ఫామ్‌హౌస్‌లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

image

TG: హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1న 3PMకు విచారణకు సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో విచారణ చేసేందుకు <<19005122>>నిరాకరించడానికి<<>> గల కారణాలను వివరించారు. తమ రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందని తెలిపారు. విచారణను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను, రికార్డులను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు.

News January 30, 2026

గ్రూప్-1 ఫలితాలు విడుదల

image

AP: గ్రూప్-1 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన వారి జాబితాను <>వెబ్‌సైట్‌లో<<>> ఉంచింది. 2023 DECలో 87 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ రాగా 2024 MARలో ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్, జూన్‌లో ఇంటర్వ్యూలు జరిగిన విషయం తెలిసిందే. పలు కారణాలతో ఫలితాల విడుదల ఆలస్యమైంది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో రిజల్ట్స్ విడుదలయ్యాయి.

News January 30, 2026

మేడారంలో అవి తుస్ పాసులే!

image

మేడారం జాతరలో వీవీఐపీ, వీఐపీ దర్శనం పాసులు ఉత్తుత్తి పాసులుగానే మిగిలిపోయాయి. పేరుకు గేట్ మీద వీవీఐపీ దర్శనం ఉంది కానీ, గద్దెలకు దూరంగా పంపుతున్నారు. నానా పైరవీలు చేసి పాస్ సంపాదించామని డాంబికంగా చెప్పుకున్నా, పోలీసుల నెట్టివేతకు ఆమడ దూరంలో ఉండిపోయారు. వచ్చే సారికి ఆ పాస్‌లకు స్వస్తి పలికి అందరికీ ఒకే పెద్ద లైన్ పెడితే కనీసం గద్దెలైనా కనిపిస్తాయని భక్తులు చెబుతున్నారు.