News January 11, 2026
నిర్మల్: ముప్పై ఏళ్ల తర్వాత.. మురిసిన స్నేహం

నిర్మల్‌లోని రెడ్డి ఫంక్షన్ హాల్ గత జ్ఞాపకాల నెమరువేతకు వేదికైంది. స్థానిక శిశు మందిర్ పాఠశాలలో 1994-95 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఒకచోట చేరి సందడి చేశారు. ఆత్మీయ సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాటి మిత్రులంతా ఒకరినొకరు కలుసుకొని పాత ముచ్చట్లను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఈ సందర్భంగా సన్మానించి, ఆశీస్సులు తీసుకున్నారు.
Similar News
News April 4, 2026
అనకాపల్లి: రేపు హాకీ జట్టు ఎంపిక పోటీలు

రాష్ట్రస్థాయిలో జరిగే మహిళ హాకీ టోర్నమెంట్‌కు అంతర్ జిల్లాల ఎంపిక పోటీలు ఈనెల 5వ తేదీన ఎలమంచిలిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే.నరేష్ తెలిపారు. 2007 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించినవారు ఈ పోటీలకు అర్హులుగా పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరిగే పోటీలకు ఆధార్ కార్డులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
News April 4, 2026
భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తాం: పాక్

పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తామని ప్రగల్భాలు పలికారు. ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బను మర్చిపోయి ఆయన ఇలా మాట్లాడటం గమనార్హం. పశ్చిమాసియా ఉద్రిక్తతల సాకుతో పాక్ ఏ చిన్న తప్పు చేసినా గట్టిగా బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News April 4, 2026
TU: పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

TU పరిధిలోని డిగ్రీ (BA/B.Com/B.Sc/BBA) విద్యనభ్యసించే రెగ్యులర్ 2, 4, 6 సెమిస్టర్ల, 1, 3, 5 బ్యాక్ లాగ్ (2021 నుంచి 2025 వరకు) విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు నేడే చివరి తేదీ అని COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుసుము రూ.100తో ఈ నెల 6 వరకు అవకాశముందన్నారు. ఈ నెల 18 నుంచి పరీక్షల షెడ్యూల్ సైతం ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు తప్పకుండా పరీక్ష ఫీజులు చెల్లించాలన్నారు.


