News January 15, 2026
నిర్మల్: మూడు మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఇలా

నిర్మల్‌లో 42 వార్డులకు ఎస్టీ-జనరల్ (1), ఎస్సీ-జనరల్ (2), మహిళ -(1), బీసీ జనరల్ (9), మహిళ(8), మహిళా రిజర్వ్ (9), అన్ రిజర్వ్ (9).. భైంసాలోని 26 వార్డులకు ఎస్టీ జనరల్ (1), ఎస్సీ జనరల్ (2), మహిళ (1), బీసీ-జనరల్(5), మహిళ (4), మహిళా రిజర్వ్(8), అన్ రిజర్వ్డ్ (5).. ఖానాపూర్‌లోని 12 వార్డులకు ఎస్టీ-జనరల్ (1), ఎస్సీ-జనరల్ (1), మహిళ (1), బీసీ జనరల్ (2), మహిళ (1), మహిళా రిజర్వ్డ్ (4), అన్ రిజర్వ్ (2).
Similar News
News February 5, 2026
మన్యం జిల్లా పోలీస్ విభాగంలో కృత్రిమ మేధస్సు: ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకు AI సేవలు విశ్వసనీయ సహాయకుడిగా ఉపయోగపడుతుందని ఎస్పీ మాధవ్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పాల్గొన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున పోలీస్ శాఖకు కూడా కృత్రిమ మేధస్సు తోడ్పడుతుందన్నారు. సాఫ్ట్‌వేర్‌తో ఏ ప్రాంతాల్లో నేరాలు జరుగుతున్నాయో అంచనాలకు దోహదపడుతుందన్నారు.
News February 5, 2026
కృష్ణా: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు GOOD NEWS

ప్రయాణికుల రద్దీ మేర ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా అనకాపల్లి(AKP)- సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. నం.07041 SC- AKP రైలు ఈ నెల 22న, నం.07042 AKP- SC రైలు 23న నడుపుతున్నామన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ AC, స్లీపర్, జనరల్ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని వెల్లడించారు.
News February 5, 2026
ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు

✒1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒1990: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్(ఫొటోలో) జననం


