News January 7, 2026

నిర్మల్: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

అంత్యక్రియలకు వచ్చి వెళ్తుండగా యువకుడు మృతి చెందిన ఘటన దిలావర్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సపూర్‌(జి)కి చెందిన నితిన్(21) HYDలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామంలో బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు బైక్‌పై నిర్మల్ బయలుదేరాడు. రహదారిపై అటవీ జంతువు అడ్డురావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. నిఖిల్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News February 9, 2026

దీపారాధన తర్వాత కాలిన వత్తులను ఏం చేయాలి?

image

దీపం వెలిగించిన తర్వాత కాలిన వత్తులను, ఆ బూడిదను పవిత్రంగా భావించాలి. వీటిని ఎప్పుడూ చెత్తబుట్టలో, అపవిత్ర ప్రదేశాలలో పారేయకూడదు. 10 రోజుల పాటు సేకరించిన ఆ వత్తులను 11వ రోజున కర్పూరం, లవంగాలు వేసి కాల్చాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా తిప్పితే ప్రతికూల శక్తులు నశిస్తాయి. చివరగా మిగిలిన బూడిదను శుభకార్యాలకు వెళ్లే ముందు తిలకంలా ధరించవచ్చు. మొక్కల మొదట్లో వేస్తే మంచి జరుగుతుంది. వాటిని అపవిత్రం చేయకూడదు.

News February 9, 2026

భద్రాద్రి: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

image

భద్రాద్రి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారాలతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు.

News February 9, 2026

ఖమ్మం: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారంతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు. బుధవారం పోలింగ్ జరగనుంది.